NRML: జిల్లాలో గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నా ఏజెన్సీల వద్ద వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. గ్రామాల నుంచి గ్యాస్ కోసం ఎండలో వచ్చిన లబ్ధిదారులకు మరో వారం పడుతుందని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. కొంతమందికే సిలిండర్లు ఇస్తున్నారని, కనీసం తాగడానికి నీటి వసతి కూడా కల్పించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.