PDPL: పెద్దపల్లి పట్టణానికి చెందిన అఖిల్ అనే యువకుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి కస్టమ్స్ ఇన్స్‌స్పెక్టర్ ఉద్యోగం పొందాడు. ప్రస్తుతం ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఆయన తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పెద్దపల్లిలో పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయనను స్థానికులు అభినందించారు.