MLG: కన్నాయిగూడెం మండలంలో పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పని చేయకుండానే రూ.31వేల డ్రా చేసినట్టు బయటపడింది. ఒకే పనిని పలుమార్లు నమోదు చేసి నిధులు ఉపసంహరించుకున్నట్టు అనుమానాలు రేకెత్తుతున్నాయి. వివరాలు లేకుండా డ్రా చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.