MNCL: మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పనిచేసిన పి.చంద్రయ్య పదోన్నతిపై జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా విధులు నిర్వహిస్తున్నారు.