ASF: జైనూర్ మండలం సంబాజిగూడ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనాన్ని మరో వాహనం బలంగా ఢీకొనడంతో ఆయన స్పృహ కోల్పోయి రోడ్డుపై పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.