పెద్దపల్లి మండలం దేవునిపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు కన్నుల పండువగా జరిగాయి. ఆలయ అర్చకులు కొండపాక శ్రీకాంత్ చార్యులు, రామాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి, అమ్మవారికి వేద మంత్రోచ్ఛారణల మధ్య పంచామృత అభిషేకం నిర్వహించారు. పౌర్ణమి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.