MDCL: నాచారం ప్రాంతంలో వినయ్ అనే వ్యక్తి QR కోడ్ స్కాన్ చేయగానే రూ.1250 మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. తెలియని వ్యక్తి పంపిన QR కోడ్ను స్కాన్ చేయడంతో వెంటనే అతని ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయి. ఈ ఘటనతో పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అపరిచితుల నుంచి వచ్చే QR కోడ్లు, లింక్లు స్కాన్ చేయవద్దని సూచిస్తున్నారు.