KMM:కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మొహమ్మద్ జావేద్ అకాల మరణం పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తెలిపారు. కాంగ్రెస్ నేత మహమ్మద్ జావేద్ రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా దురదృష్టకరం అని ఆయన స్థానాన్ని ఎవరు పూడ్చలేనిదని కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం జావేద్ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.