TG: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.100 ఇవ్వనందుకు దుండగులు దంపతులపై దాడి చేశారు. దంపతుల పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త శంకరయ్య(60) మృతిచెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.