AP: తమిళనాడులో డీఎంకే-వామపక్షాల కూటమి బలంగా ఉందని, అక్కడ సీఎం చంద్రబాబు ప్రచారం విఫలమవుతుందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. గతంలో జయలలిత హయాంలో తెలుగు ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉన్న బాబు, ఇప్పుడు ప్రధాని మోదీ కోసం ప్రచారానికి వెళ్లడం విడ్డూరమన్నారు. మోదీకి ఆపద వచ్చింది కాబట్టే బాబు రంగంలోకి దిగారని, అక్కడ ఆయనకు భంగపాటు తప్పదని ఎద్దేవా చేశారు.