KNR: హుజూరాబాద్ రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఏఈఓ నిఖిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులకు మట్టి నమూనాల ప్రాముఖ్యత సేకరించే పద్ధతి, సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత, సాయిల్ హెల్త్ కార్డ్ ఉపయోగాలపై వాలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే సాయంత్రం మూడు గంటలకు సీఎం రెండో విడత రైతు భరోసా విడుదలపై ప్రత్యక్ష ప్రసారం వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని పేర్కొన్నారు.