కడప సీసీఎస్ పోలీస్ స్టేషన్ సీఐగా డి. హాజీ వల్లి బాధ్యతలు స్వీకరించారు. గతంలో కడప, నంద్యాల జిల్లాల్లో పనిచేసిన ఆయనకు విశేష అనుభవం ఉంది. నేరాల నియంత్రణపై దృష్టి సారించి, ప్రజల సహకారంతో చట్టసువ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని సీఐ తెలిపారు. అదేవిధంగా పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు.