SRD: నారాయణఖేడ్ మున్సిపల్ పరిధి బస్ డిపో వెనకాల ఏర్పాటు చేసిన జగద్గురు పంచాచార్య జంగమ భవనం నిర్మాణానికి మున్సిపల్ ఛైర్మన్ నాగేష్ శెట్కార్ సోమవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జంగమ సమాజ్ సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీర శైవ జంగమ గౌరవాధ్యక్షుడు శంకరయ్య, సిద్దయ్య, శివకుమార్ రేవణయ్య, శ్రీశైలం పాల్గొన్నారు.