అన్నమయ్య: రాయచోటిలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో అక్షయ తృతీయ, బసవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చందన అలంకారంలో స్వామి, అమ్మవార్లు దర్శనమిచ్చారు. బసవేశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహించగా, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.