TG: కాంగ్రెస్ హామీలు అమలు చేయలేదని స్టీరియో రికార్డు వినిపిస్తున్నారని, ఆరోపణలతో బీఆర్ఎస్ నేతల బతుకు బజారుపాలవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. పదవి పోయిందనే ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో ఉందన్నారు. పార్టీలను విమర్శిస్తే స్థాయి పెరగదని సూచించారు. ఏ ముఖం పెట్టుకుని మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని ప్రశ్నించారు.