KMM: రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరకు కొనాల్సిన ప్రభుత్వం ప్రజల నోట్లో మట్టి కొడుతుందని ఎర్రుపాలెం మండల BRS పార్టీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పత్తి పంటను సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లేకపోవడంతో భారీగా నష్టపోయారని, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతులను ఆదుకోవాలన్నారు.