PDPL: 15 రోజులుగా తహసీల్దార్ లేక రామగుండం ప్రజలు పడుతున్న ఇబ్బందులకు చెక్ పడింది. తహసీల్దార్ లేక కార్యాలయానికి సిబ్బంది తాళాలు వేశారు. దీనిపై వెల్లువెత్తిన నిరసనలతో పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పందించారు. కొత్త తహసీల్దార్ సునీతను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. నూతన తహసీల్దార్ రాకతో పెండింగ్లో ఉన్న పత్రాల జారీ చేయనున్నారు.