BHNG: యాదగిరిగుట్ట పట్టణంలో దాదాపుగా 800 ఇండ్లు, మండల వ్యాప్తంగా సుమారుగా 3 వేల ఇళ్లు నిషేధిత జాబితాలో పెట్టి పేదల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్ర వెంకటయ్య మండిపడ్డారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాటలు చెప్పుకుని కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.