SRCL: ముస్తాబాద్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం పాల్గొన్నారు. మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునరుద్ధరణ ఉత్సవాలు, శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలకు హాజరై, నామాపూర్ గ్రామంలో ఇరిగేషన్ విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం కస్తూరిబా పాఠశాలలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్నారు.