SDPT: నంగునూరులో ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలను భక్తులు, యువకులు ఘనంగా నిర్వహించారు. శంకరాచార్యుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. భారతదేశంలో అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేసి, ఆధ్యాత్మికతకు నూతన దిశానిర్దేశం చేసిన మహానుభావుడు ఆయన అని కొనియాడారు. సనాతన ధర్మ పరిరక్షణకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.