HYD: హైదరాబాద్లో గండిపేట పైప్లైన్ సమస్య పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. రూ.280 కోట్లతో పాత పైప్లైన్ స్థానంలో కొత్త పైప్లైన్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జలమండలి పనులను వేగవంతం చేస్తోంది. గోదావరి దశ-2, 3 ప్రాజెక్టుల పనులు ప్రారంభమవడంతో నగరానికి నీటి సరఫరా మరింత బలోపేతం కానుంది.