KDP: అవధానాల్లో, ఆశుకవితా ప్రదర్శనల్లో చమత్కార భరితంగా కవిత్వ రచన చేయడంలో దిట్ట గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి అని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా. భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి అన్నారు. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ‘నెలనెలా సీమ సాహిత్యం’ సదస్సులో ‘గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి జీవితం – సాహిత్యం’ అనే అంశంపై ప్రసంగించారు.