JGL: జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదలలో జాప్యం కారణంగా విద్యార్థులు రోడ్డెక్కారు. రాష్ట్రంలో మద్యం శాఖకు మంత్రి ఉన్నప్పటికీ, విద్యా శాఖకు మంత్రి లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు. తక్షణమే బకాయిలను విడుదల చేయాలని విద్యార్ధి నాయకులు డిమాండ్ చేశారు.