KDP: జిల్లా వ్యాప్తంగా ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు ఘనంగా జరిగాయి. కడప రిమ్స్ ఈద్గా వద్ద ప్రత్యేక నమాజు ప్రార్థనల్లో ముస్లిం సోదరులు భారీగా పాల్గొన్నారు. పరస్పరం ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చింతకొమ్మదిన్నే సీఐ బాల మద్దిలేటి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.