SRD: 2025-26 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూలు కులాలకు 409 యూనిట్లు మంజూరైనట్లు కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం తెలిపారు. మంజూరైన వారికి 8.21 కోట్ల రూపాయల సహాయం అందిస్తామని చెప్పారు. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. షెడ్యూలు కులాల సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.