KMR: తూప్రాన్ సమీపంలోని NHపై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రామారెడ్డి మండల మాజీ ZPTC, జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆయన అకస్మాత్తుగా మరణించడంతో రామారెడ్డి మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.