ఒంటిమిట్టలో ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా కడప, ఒంటిమిట్ట, రేణిగుంట రహదారులపై ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నట్లు ఎస్పీ విశ్వనాథ్ తెలిపారు. ఈ మళ్లింపులు రేపు ఉదయం 9 గంటల నుంచి 2వ తేదీ ఉదయం 8 గంటల వరకు అమల్లో ఉంటాయి. భక్తుల కోసం 18 చోట్ల పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.