ఆసిఫాబాద్‌లోని తాటియా గార్డెన్లో నిర్వహించిన 3 రోజుల ‘పీఎం విశ్వకర్మ’ వాణిజ్య ప్రదర్శనలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ హస్తకళలను ప్రదర్శించారు. జిల్లా పరిశ్రమల అధికారి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో, చేతివృత్తుల వారికి మార్కెటింగ్, సాంకేతికతపై అవగాహన కల్పించారు. దీనివల్ల స్థానిక కళాకారులకు ఆర్థిక చేయూత లభిస్తుందన్నారు.