GDWL: మత్తు పదార్థాలతో జీవితం అంధకారమవుతుందని, యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండాలని గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పిలుపునిచ్చారు. ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా శనివారం విద్యార్థులు, వైద్యాధికారులతో కలిసి కృష్ణవేణి చౌరస్తా నుంచి డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో మత్తు ప్రభావితుల చికిత్స విభాగాన్ని ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.