WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేసవి ఎండల తీవ్రత ప్రజలను వణికిస్తోంది. ఇవాళ జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలను దాటాయి. మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్నారు. ఇంటి నుంచి అవసరమైన పనులకు మాత్రమే బయటకు వస్తున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.