NZB: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో SSC, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి అశోక్ తెలిపారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు రెండు సెషన్లలో జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాలు, టైమ్ టేబుల్ సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.