KMR: జాతీయ స్థాయి హాకీలో ప్రతిభ చాటి భారత జట్టుకు ఎంపికైన గర్గుల్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని కలిగోట వీణను కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం తన ఛాంబర్లో అభినందించారు. జపాన్‌లో జరగనున్న సబ్ జూనియర్ ఆసియా కప్‌కు వీణ ప్రాతినిధ్యం వహించనుంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. డీఈవో రాజు, పీడీ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.