SDPT: పాలిసెట్ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 20వ తేదీ వరకు గడువు ఉందని చేర్యాల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీరాంకుమార్ తెలిపారు. పదో తరగతి చదువుతున్న ఆసక్తి గల విద్యార్థులు https://www.polycet.sbtet.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 13న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.