SRPT: అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన బ్లాక్ బెల్ట్ 7వ డాన్ అలేటి సహదేవ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నానికి ఎంపికయ్యారు. ఏప్రిల్ 26, 2026న హైదరాబాద్లో నిర్వహించనున్న ప్రపంచంలోనే అతిపెద్ద కరాటే ప్రదర్శనలో ఆయన పాల్గొననున్నారు. కరాటే రంగంలో విశేష అనుభవం కలిగిన సహదేవ్ ఈ ప్రతిష్ఠాత్మక పోటీకి ఎంపిక కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.