MNCL: ప్రజలకు మంచి వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని దండేపల్లి మండల ప్రత్యేక అధికారి దుర్గాప్రసాద్ ఆదేశించారు. ఇవాళ దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని పీహెచ్సీని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.