NZB: జిల్లాలో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం భీమ్గల్ మండల పరిషత్ కార్యాలయంలో బాల్కొండ నియోజకవర్గ స్థాయి అధికారులతో ఆమె నీటిసరఫరాపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా ఇతర క్షేత్రస్థాయి సమస్యలపై ఆరా తీశారు.