NRML: నిర్మల్ జిల్లా వడ్యాల్ గ్రామంలో ప్రాచీన శిలాశాసనాలను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు తెలిపారు. హనుమాన్ ఆలయ సమీపంలోని దీపపు స్తంభంపై మధ్యయుగ తెలుగు-కన్నడ లిపిలో చెక్కిన దాన శాసనం, మరో రెండు లఘు శాసనాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఇవి కళ్యాణి చాళుక్యుల నుంచి కాకతీయుల కాలానికి చెందినవిగా భావిస్తున్నామని పేర్కొన్నారు.