హైదరాబాద్‌కు చెందిన 92 ఏళ్ల డాక్టర్ సూరి శ్రీమతి 60 ఏళ్లుగా వైద్యమే శ్వాసగా సేవలందిస్తున్నారు. అరుదైన రికార్డుగా ఏకంగా 2 లక్షల మందికి పైగా ప్రాణం పోసిన ఆమె, మాతాశిశు మరణాల తగ్గింపులో అద్భుత కృషి చేశారు. వయసు భారమైనా నేటికీ నిరంతరం శ్రమిస్తూ, ఆదర్శవంతమైన సేవలతో నేటి తరం వైద్యులకు ఆమె నిజమైన రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు.