SRPT: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి విడుదలైన గోదావరి జలాలు చివ్వెంల మండలంలోకి ఈరోజు చేరుకున్నాయి. కాలువల ద్వారా వచ్చిన నీరు స్థానిక చెరువులు, సాగు భూములకు చేరడంతో మండల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల వద్ద కాలువలు నీటి ప్రవాహం కనిపించడంతో రైతులు వరి, ఇతర పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.