MNCL: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేసి బలోపేతం చేయాలని, అనాథ పిల్లలను గుర్తించి వసతి గృహాలలో చేర్పించాలని సూచించారు.