NLG: జీపీ కార్మికులకు జీతాలు చెల్లించామని చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం తెలిపారు. గత సమస్యలను తీర్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీతాలను క్రమబద్ధీకరించిందని, ప్రస్తుతం కేవలం రెండు నెలలే బకాయి ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై, ఎమ్మెల్యే వీరేశంపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు.