మహబూబ్ నగర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో రేపు ఉదయం 10:30 గంటలకు ఎంప్లామెంట్ ఎక్సైజ్ పిల్లలమర్రి రోడ్డులో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి మైత్రి ప్రియ తెలిపారు. 10వ తరగతి, ఆపై చదివిన 18-30 ఏళ్ల యువతకు 6 ప్రవేటు సంస్థల్లో 250 ఖాళీలున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు సర్టిఫికెట్లు, బయోడేటాతో హాజరుకావాలన్నారు.