WGL: హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించబోయే కిసాన్ న్యాయ్ మహా ధర్నాకు హాజరయ్యేందుకు నర్సంపేట నియోజకవర్గం నుంచి యూత్ కాంగ్రెస్ నేతలు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సందీప్ తెలిపారు. వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.