TG: యూపీ ఎన్నికలలోపు మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని, దక్షిణాది రాష్ట్రాలను ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత తనదే అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. కేంద్రానికి రాజకీయ అధికారం ఉండొచ్చు.. కానీ, ఆర్థిక వనరులు మాత్రం తమ దగ్గర నుంచి అందుతున్నాయని స్పష్టం చేశారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టొద్దన్నారు.