NLG: చిట్యాల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని అంగన్వాడీ, ప్రీ-ప్రైమరీ సెంటర్లో ‘పోషణ పక్వాడ’లో భాగంగా ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ పందిరి గీత ముఖ్య అతిథిగా హాజరై, బాలల ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో పిల్లల సంక్షేమం, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.