ADB: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్లో సమావేశమై మాట్లాడారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో పంట మార్పిడిని ప్రోత్సహించాలని అన్నారు. పత్తికి బదులుగా కంది, పెసర, మినుములు, సోయాబీన్ వంటి అపరాలు, నూనె గింజలు, కూరగాయల సాగు చేపట్టాలని సూచించారు.