కోనసీమ: తాగునీటి సమస్య జఠిలంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధికారులను ఆదేశించారు. సఖినేటిపల్లి మండల పరిషత్ సమావేశంలో బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు. తీర గ్రామాల్లో మంచినీటి సమస్య గతం కన్నా మెరుగయిందన్నారు. వచ్చే ఏడాది మార్చినాటికి తీర గ్రామాలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందిస్తామని చెప్పారు.