TPT: గల్ఫ్ దేశంలో చిక్కుకున్న చంద్రగిరి మహిళను స్వదేశానికి రప్పించేందుకు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, SP ఎల్.సుబ్బరాయుడు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జీవనోపాధి కోసం వెళ్లి అక్కడ ఇబ్బందులు పడుతున్న బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించారు. మహిళను సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని అదనపు ఎస్పీ వెంకటరావు చెప్పారు.