ఖమ్మం జిల్లాలో వచ్చే కొన్ని రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని జిల్లా అధికారులు హెచ్చరించారు. మధ్యాహ్న వేళల్లో అవసరం లేకుండా బయటకు వెళ్లొద్దని సూచించారు. చిన్నారులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్యశాలను సంప్రదించాలని సూచించారు.