GDWL: ధరూర్ మండలం మార్లబీడు కాంప్లెక్స్ పరిధిలోని చెన్నారెడ్డి పల్లె ప్రాథమిక పాఠశాలను గురువారం జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని రికార్డులను, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని ఆమె సూచించారు. అలాగే విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని ఉపాద్యాయులు రాజేంద్రప్రసాద్‌కు సూచించారు.